← Back to news

కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీపీఐ

By DK· 19h ago
కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీపీఐ

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో కరువు పరిస్థితులపై సీపీఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట కరువు దీక్షలు నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, కరువును జాతీయ విపత్తుగా గుర్తించి ప్రత్యేక సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలకు కరువు పెన్షన్ అందించాలని కోరారు. రైతుల బ్యాంకు రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి పంటల బీమా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

More in Local