← Back to news

కార్మికులకు పండుగ బోనస్..

By Prashanth· 5 Oct 2026
కార్మికులకు పండుగ బోనస్..

కోల్ ఇండియా మేనేజ్‌మెంట్ - కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చల్లో ఒక్కో కార్మికుడికి 1,10,250 రూపాయలు దీపావళి బోనస్‌గా చెల్లించేందుకు అగ్రిమెంట్ కుదిరింది. Performance Linked Reward (PLR)‌లో బాగంగా ఈ మొత్తాన్ని చెల్లించనున్నారు. దీంతో TG సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 32 వేల మంది కార్మికులకు ప్రయోజనం కలగనుంది. దేశవ్యాప్తంగా కోల్ ఇండియాలో 1,96,753 మంది కార్మికులకు ఈ బోనస్ అందుతుంది. 2025 ఏప్రిల్‌ 1 నుండి 2026 మార్చి 31 మధ్య రిటైర్‌ అయిన సుమారు 8,351 మందికి కూడా రూల్స్ ప్రకారం PLR బోనస్ ఇవ్వనున్నారు.

More in Current Affairs