← Back to news

వినాయక ఊరేగింపులో కుల వివక్ష?

By Mohan· 1d ago· విజయనగరం

విజయనగరం జిల్లా రాజాం మండలం సారధి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా కుల వివక్ష జరిగిందని దళిత యువకులు ఆరోపిస్తున్నారు. మాల కాలనీ యువకులు తీసిన వినాయకుడి ఊరేగింపును కాపు వీధిలోకి రానివ్వకుండా కొందరు అడ్డుకున్నారని వారు చెప్పారు. విషయం తెలిసిన వెంటనే రాజాం పోలీసులు స్పాట్‌కి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఊరిలో అందరూ కలిసిమెలిసి వేడుకలు జరుపుకోవాలని, కుల వివక్ష చూపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

More in Local