రీల్స్, ఫ్లాష్ మాబ్‌లతో అవయవ దాన ఉద్యమం

HYD: “అవయవ దానం చెయ్యాలన్న మీ ఒక్క నిర్ణయం.. ఎన్నో ప్రాణాలను కాపాడుతుంది” ఇదీ జాతీయ అవయవ దాన దినోత్సవం వేళ చాకలి ఐలమ్మ వర్సిటీ విద్యార్థుల ప్రతిజ్ఞ. సోషల్ మీడియా రీల్స్, ఫ్లాష్ మాబ్‌లతో ఆర్గాన్ డొనేషన్ పైన యూత్ అవైర్నెస్ తేవాలని ఈ కార్యక్రమం పిలుపునిచ్చింది. రోటరీ క్లబ్ ప్రతినిధి మోహన్ నిష్టాల తెలంగాణ తొలి ఆర్గాన్ డొనేషన్ రోటరాక్ట్ క్లబ్ ప్రకటించారు. వర్సిటీ VC సూర్య ధనంజయ్, రిజిస్ట్రార్ గడ్డం మల్లేశం, మోహన్ ఫౌండేషన్ భాను ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.


