← Back to news

రూపారెడ్డి హత్యపై తీవ్ర ఆగ్రహం.. విద్యార్థి సంఘాల నివాళి

By Mohammed Hafeez· 22 Aug 2026
రూపారెడ్డి హత్యపై తీవ్ర ఆగ్రహం.. విద్యార్థి సంఘాల నివాళి

TG: నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్యను విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. గద్వాల పట్టణంలోని చింతలపేట ఎస్సీ, బీసీ, ఆనందనిలయం హాస్టల్ విద్యార్థులతో కలిసి ఆమెకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థులు సెల్‌ఫోన్లు, డ్రగ్స్, మద్యం, డబ్బులకు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. తల్లిదండ్రులు, గురువులను గౌరవించడం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు.

రూపారెడ్డి హత్యపై తీవ్ర ఆగ్రహం.. విద్యార్థి సంఘాల నివాళి

More in Local