Expired చాక్లెట్ల కోసం ఎగబడ్డ జనం.. వీడియో వైరల్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో Expired చాక్లెట్ల కోసం జనం ఎగబడ్డారు. పంకీ ఇండస్ట్రియల్ ఏరియాలోని డంపింగ్ సైట్ వద్ద చాక్లెట్లు, టాఫీలను పడేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. బ్యాగులు, బస్తాలు, డబ్బాల్లో చాక్లెట్లను నింపుకుని తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Expired ఫుడ్ ప్రొడక్ట్స్‌ను అలా తీసుకెళ్లడంపై నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.



