← Back to news

బస్తీ దవాఖానాలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తనిఖీ

By Srikanth Goud· 1d ago· Jagitial
బస్తీ దవాఖానాలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తనిఖీ

TG: జగిత్యాల జిల్లా ధర్మపురిలోని బస్తీ దవాఖానాను డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎన్.శ్రీనివాస్ తనిఖీ చేశారు. దవాఖానాలో మందుల నిల్వను పరిశీలించడంతో పాటు ఓపీడీ రికార్డులు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందులు, రికార్డుల నిర్వహణపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందేలా సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలని సూచించారు. దవాఖానాలో వైద్య సేవల నాణ్యత, మందుల లభ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 3h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.