కెమికల్ తాగి రెండేళ్ల పాప మృతి

TG : మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జువెలరీ షాపులో బంగారం మెరుగుపెట్టే కెమికల్‌ను 2 ఏళ్ల మిషా అనే చిన్నారి తెలియక నోట్లో పెట్టుకుంది. పాప స్పృహ కోల్పోవడంతో పేరెంట్స్ వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ట్రీట్‌మెంట్ తీసుకుంటూ పాప చనిపోయింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు జువెలరీ షాప్ ముందు ఆందోళనకు దిగారు.



