S.I.Rపై హీట్.. హైదరాబాద్‌లో ర్యాలీ
TG: S.I.R విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ హైదరాబాద్‌లో ‘చలో లోక్‌భవన్’ కార్యక్రమం చేపట్టింది. ఇందిరా గాంధీ విగ్రహం నుంచి సోమాజిగూడలోని లోక్ భవన్ వరకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు. CEC జ్ఞానేశ్ కుమార్ రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. S.I.R లో ఓటర్ లిస్ట్‌పై ఉన్న అనుమానాలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


