ఈరోజే గాంధీ జయంతి.. కానీ ఎక్కడంటే?

సాధారణంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి జరుపుకుంటాం. కానీ గుజరాత్ విద్యాపీఠ్ యూనివర్సిటీలో ఈ ఏడాది అక్టోబర్ 7న గాంధీ జయంతి సెలబ్రేషన్స్ చేస్తున్నారు. దీనికి కారణం ఆ యూనివర్సిటీ ఫాలో అయ్యే హిందూ విక్రమ్ క్యాలెండర్. ప్రపంచవ్యాప్తంగా గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ఫాలో అవుతారు. కానీ గుజరాత్ విద్యాపీఠ్ గాంధీ జయంతిని భాద్రపద మాసంలోని ద్వాదశి రోజున జరుపుతుంది. ఈ లెక్కన ఈ ఏడాది అక్టోబర్ 7న వచ్చింది. మరో విశేషం ఏంటంటే.. ఈ యూనివర్సిటీని మహాత్మా గాంధీనే స్థాపించారు.
