ఇది గాంధీ దేశం.. నిరసనకు పెర్మిషన్ కావాలా? MP
RJD MP మనోజ్ కుమార్ ఝాను ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్నప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ వాహనంలో ఉండగానే మీడియాతో మాట్లాడిన ఆయన.. గాంధీ జయంతి రోజున శాంతియుత నిరసనను అడ్డుకోవడంపై ప్రశ్నించారు. “ఇది గాంధీ దేశం.. నిరసనకు కూడా అనుమతి కావాలా?” అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలంటూ నిరసనకు వచ్చినట్లు తెలిపారు.