నిమజ్జనంలో DJలకు నో పర్మిషన్!

మహబూబ్‌నగర్‌లో గణేష్ నిమజ్జనం శాంతియుతంగా జరిగేలా, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా SP జానకి తెలిపారు. సుప్రీంకోర్టు రూల్స్, చట్టపరమైన నిబంధనల ప్రకారం నిమజ్జన ఊరేగింపుల్లో DJ సౌండ్ సిస్టమ్‌కు అనుమతి లేదని చెప్పారు. ఈ రూల్స్ కాదని డీజేలు పెడితే, ఉత్సవ నిర్వాహకులు, DJ ఆపరేటర్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.



