శాంతి, సమత్వమే నిజమైన సమాజం

అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా సమాజంలో శాంతి, ఐక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జమాత్-ఎ-ఇస్లామీ హింద్ పిలుపునిచ్చింది. శాంతి అంటే కేవలం యుద్ధాలు లేకపోవడం మాత్రమే కాదని, ప్రతీ ఒక్కరికీ గౌరవం, సమానత్వం, న్యాయం, భద్రత లభించడమే నిజమైన శాంతి అని వారు చెప్పారు. మతం, కులం, భాష వంటి భేదాలు పక్కనపెట్టి ద్వేషాన్ని వీడాలని కోరారు. ఏవైనా సమస్యలు ఉంటే హింస ద్వారా కాకుండా చర్చలు, సహనంతో పరిష్కరించుకోవచ్చన్నారు. మన ప్రవర్తనలో శాంతిని పాటిస్తేనే మంచి సమాజాన్ని నిర్మించుకోగలమని పేర్కొన్నారు.



