← Back to news

సినిమాల్లో అలాంటి ఆడవాళ్లే కావాలంటున్న లక్ష్మీ మంచు!

By BK· 11 Aug 2026
సినిమాల్లో అలాంటి ఆడవాళ్లే కావాలంటున్న లక్ష్మీ మంచు!

నటి లక్ష్మీ మంచు సినిమా కథలో కొత్తదనం ఉండి, దర్శకుడి విజన్ నచ్చితే ఏ ప్రాజెక్ట్‌ అయినా ఒప్పుకుంటానన్నారు. పాత్ర ఎంతసేపు ఉందన్నది కాకుండా, కథ బాగుందో లేదో చూడటమే తనకు ముఖ్యమని అన్నారు. వెండితెరపై తమకంటూ ఒక ఆలోచన ఉండి, ధైర్యంగా మాట్లాడే బలమైన మహిళా పాత్రలు ఇంకా ఎక్కువ రావాలని ఆమె కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన రెండు తెలుగు కామెడీ సినిమాలు, ఒక తమిళ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు ఒక కొత్త షో షూటింగ్ కూడా త్వరలోనే మొదలుకాబోతుంది.

More in Cinema