← Back to news

ఎలివేటెడ్ కారిడార్ నిధుల కోసం కేంద్రమంత్రికి వినతి

By శ్రీనివాస్ నాగర్ కర్నూల్· 1d ago· Kalwakurthy (Ct), Kalwakurthy, Nagarkurnool
ఎలివేటెడ్ కారిడార్ నిధుల కోసం కేంద్రమంత్రికి వినతి

నాగర్‌కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా NH-765పై ప్రతిపాదిత మన్ననూర్–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఎంపీ డాక్టర్ మల్లు రవి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి వినతిపత్రం అందజేశారు. కారిడార్‌కు సంబంధించిన DPR ఆమోదంతో పాటు అటవీ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసి, నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించాలని కోరారు.

More in Local