← Back to news

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

By Sagar· 1d ago· Ramagundam, Ramagundam, Peddapalli
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కార్పొరేషన్ ఏరియా పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి ఘనంగా జరిగింది. బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘం అధ్యక్షులు చిప్ప రాజేష్, ప్రధాన కార్యదర్శి ఆడెపు శంకర్ మాట్లాడారు. ఆసిఫాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని, మార్కండేయ కాలనీకి కొండా లక్ష్మణ్ బాపూజీ మార్గ్‌గా నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని, స్థానిక యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు.

More in Local