SRR పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

కరీంనగర్ SRR ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాల పీజీ రెండో, 4వ సెమిస్టర్ ఫలితాలను ఇవాళ విడుదల చేశారు. ప్రిన్సిపాల్ ఆచార్య కల్వకుంట రామకృష్ణ, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య తిరుకోవెల శ్రీనివాస్ అధ్యాపకులతో కలిసి ఫలితాలను ప్రకటించారు. 2వ సెమిస్టర్లో 86 శాతం, నాలుగో సెమిస్టర్లో 84 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. PG మూడో బ్యాచ్ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.


