BAC అంటే ఏమిటి?

అసెంబ్లీ సమావేశాల సమయంలో తరచూ వినిపించే పదం ‘BAC’. అంటే ‘Business Advisory Committee’. అసెంబ్లీలో ఏ అంశాలపై చర్చ జరగాలి, ఏ బిల్లులు ఎప్పుడు తీసుకోవాలి, ఏ అంశానికి ఎంత సమయం కేటాయించాలి లాంటి విషయాలను ఈ కమిటీ నిర్ణయిస్తుంది. స్పీకర్ నేతృత్వంలో ఏర్పడే BACలో ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ఉంటారు. అసెంబ్లీ సమావేశాల ఎజెండా, చర్చల సమయంపై నిర్ణయాలు తీసుకునే కీలక కమిటీ ఈ BAC.



