← Back to news

లడ్డూ వేలం.. రూ.11 లక్షలు!

By A Srisailam· 1h ago· Farooqnagar (Ct), Farooqnagar, Ranga Reddy
లడ్డూ వేలం.. రూ.11 లక్షలు!

రంగారెడ్డి జిల్లాలోని షాద్ధి నగర్ పరిధిలోని మధురాపురం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా లడ్డూ వేలం జరిగింది. రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలంలో భక్తులు ఫుల్ ఎనర్జీతో పాల్గొన్నారు. చివరికి మల్కయ్యగారి సునీత వెంకట్‌రెడ్డి దంపతులు రూ.11,11,111కు లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఇది తమ కుటుంబానికి అదృష్టమని వారు అన్నారు. 2011లో రూ.41,116తో మొదలైన వేలం ఇప్పుడు రూ.11 లక్షలకు చేరింది. లడ్డూ ప్రసాదం కోసం పోటీ ఏటా పెరుగుతోంది.

లడ్డూ వేలం.. రూ.11 లక్షలు!

More in Local