రీల్స్‌లో బంగారం చూపించింది.. మొత్తం దోచుకెళ్లారు

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా తమ్మత్తుకోణంలో ఉండే యూట్యూబర్ దంపతులు వినోద్ కుమార్, మధుమిత ఇంట్లో భారీ దోపిడీ జరిగింది. వాళ్లు చేసిన వీడియోనే ఇందుకు కారణం. తమ ఇంట్లోని పూజగదిలో బంగారం, వజ్రాభరణాలు, నగదును చూపిస్తూ మధుమతి రీల్స్ పోస్ట్ చేసింది. అవి వైరల్ అయ్యాయి. దొంగలు తలుపు పగలగొట్టి సుమారు 80 తులాల బంగారు నగలు, వజ్రాలు, నగదు దోచుకెళ్లారు. వీటి విలువ కోటి రూపాయల దాకా ఉంటుంది. CCTV ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.





