ఢిల్లీలో ఆర్టిస్ట్ హత్య.. ఏడుగురు అరెస్ట్!

ఢిల్లీలో దారుణ హత్యకు గురైన మణిపురి మ్యూజీషియన్ సి. విక్రమ్ సింగ్ కేస్‌లో ఢిల్లీ పోలీస్ వేగంగా యాక్షన్ తీసుకుంటోంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఏడుగురుని అరెస్ట్ చేయగా, ఒక జువైనల్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ఈ రోజు మాట్లాడుతూ, రాబోయే 8 నుండి 9 రోజుల్లోనే చార్జ్‌షీట్ ఫైల్ చేస్తామని పోలీసులు తనకు అస్యూరెన్స్ ఇచ్చారని తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులకు చట్టపరంగా సాధ్యమైనంత కఠినమైన శిక్ష పడేలా చూస్తామని ఆయన స్పష్టం చేశారు.

