వరికుంటపాడు హైవేపై రోడ్డు ప్రమాదం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం, ట్రాలీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని, గాయపడిన వారిని చికిత్స కోసం పామూరు ఆస్పత్రికి తరలించారు.



