← Back to news

ముథోల్‌లో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం

By Bala· 1d ago
ముథోల్‌లో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం

నిర్మల్ జిల్లా ముథోల్ మండలం ఎడ్బిడ్, చింతకుంట గ్రామాల్లో వినాయక నిమజ్జన శోభాయాత్రలు ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఊరేగింపులు సోమవారం వేకువజాము వరకు కొనసాగాయి. నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో విగ్రహాలను చెరువుల వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ముథోల్‌లో పోలీసు బృందాలతో పర్యవేక్షిస్తూ నిర్వాహకులతో సమన్వయం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. సహకరించిన అధికారులు, పోలీసులకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.

More in Local