← Back to news

చివ్వెంలలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

By Ramakrishna· 1d ago· Krishna Nagar Colony, Suryapet, Suryapet
చివ్వెంలలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2026 సంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఎంపీడీవో సంతోష్ కుమార్, ఎంఈఓ రమణ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువాలు, జ్ఞాపికలు అందజేశారు. విద్యారంగంలో వారి కృషిని కొనియాడారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తారని అధికారులు అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

More in Local