← Back to news

హనుమకొండలో పవన్ బర్త్ డే.. కార్యకర్త కుటుంబానికి FD!

By Srikanth· 2d ago
హనుమకొండలో పవన్ బర్త్ డే.. కార్యకర్త కుటుంబానికి FD!

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో జనసేన కార్యకర్తలుపవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు, పాఠశాలలో స్టూడెంట్స్‌కు పండ్లు పంపిణీ చేశారు. మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన జియవొద్దీన్ అనే వీరాభిమాని రోడ్ ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన ఇద్దరు కూతుళ్లకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, బాండ్లను కుటుంబానికి అందజేశారు. పార్టీ అధికార ప్రతినిధి చల్లా శివారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తకు రూ.5 లక్షల బీమా పాలసీ తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ దేనని గుర్తు చేశారు.

హనుమకొండలో పవన్ బర్త్ డే.. కార్యకర్త కుటుంబానికి FD!
హనుమకొండలో పవన్ బర్త్ డే.. కార్యకర్త కుటుంబానికి FD!

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.