విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు: కలెక్టర్

భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో అభివృద్ధి పనులను కలెక్టర్ అంకిత్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మల్కానపల్లి, చిన్నబండిరేవు గ్రామాల్లో పర్యటించిన భూరీసర్వే, ఇందిరమ్మ ఇళ్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. మల్కానపల్లిలో భూరీసర్వే వివరాలను పరిశీలించారు. సరైన సమాచారం అందించలేకపోయిన ఆర్‌ఐపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లపై పూర్తి వివరాలు ఇవ్వలేకపోయిన ఎంపీడీవో వివేక్ చంద్రకు చార్జ్‌మెమో జారీచేసి వివరణ ఇవ్వాలని ఆదేశించారు.



