← Back to news

చికెన్ ముక్కల వివాదం..స్నేహితుడి హత్య

By Vishi· 4d ago· Ndtv
చికెన్ ముక్కల వివాదం..స్నేహితుడి హత్య

కర్ణాటక రాష్ట్రం బెలగావి జిల్లాలో ఒక పార్టీలో చికెన్ ముక్కలు ఎక్కువ తిన్నందుకు ఫ్రెండ్స్ మధ్య జరిగిన గొడవ హత్యకు కారణమైంది. యూపీకి చెందిన సీతారామ్ ముదలగి తాలూకాలోని హునష్యాల్ పీజీ గ్రామంలో ప్రియా స్టీల్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతని స్నేహితుడు అరుణ్ కుమార్ కూడా అదే కంపెనీలో పని చేస్తున్నాడు. రాత్రి ఇద్దరూ కలిసి పార్టీ చేసుకున్నారు. ఒకరు చికెన్ ముక్కలు ఎక్కువ తిన్నారని గొడవ మొదలైంది. గొడవ తీవ్రమై అరుణ్ కుమార్ కత్తితో సీతారామ్ ఛాతీపై పొడిచాడు. హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

More in Current Affairs