ఢిల్లీ పోలీసులకి గట్టి కౌంటర్- అభిజీత్ దీప్కే

జర్నలిస్టుల కోసం ఢిల్లీ పోలీస్ రీసెంట్ గా X లో కొన్ని గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. ప్రొటెస్ట్ ల కవరేజ్ అప్పుడు జర్నలిస్టులు ఐడీ కార్డులు సరిగ్గా కనిపించేలా వేసుకోవాలని, రూల్స్ పాటించాలని అందులో చెప్పారు. అయితే దీనికి కౌంటర్ ఇస్తూ CJP ఫౌండర్ అభిజీత్ దీప్కే "ముందు మీ నేమ్ ట్యాగ్స్ మీరు పెట్టుకోండి" అంటూ రిప్లై ఇచ్చారు. జంతర్ మంతర్ ప్రొటెస్ట్ లలో పోలీసులు కూడా ముందు రూల్స్ పాటించాలని ఉద్దేశిస్తూ ఆయన ఈ కామెంట్ చేశారు.


