అడవులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత

కామారెడ్డి జిల్లా జుక్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 72వ వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, వాలీబాల్ తదితర పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై అధికారులు అవగాహన కల్పించారు. అడవుల విస్తీర్ణం తగ్గడంతో వన్యప్రాణులు ఆవాసాలను కోల్పోతున్నాయని, చెట్లను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని సూచించారు.



