12న ఒంగోలులో MRPS, MSP మహాధర్నా

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ నెల 12న నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని MRPS, MSP నేతలు పిలుపునిచ్చారు. శ్రీచైతన్య నవోదయ కోచింగ్ సెంటర్‌లో హత్యకు గురైన తౌషిక్, ఆయన తల్లి మౌలాబి మృతికి కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు లింగసముద్రం మండల MRPS అధ్యక్షుడు జడ వీరస్వామి మాదిగ ఆధ్వర్యంలో తిమ్మారెడ్డిపాలెం, గంగపాలెం గ్రామాల్లో సమావేశాలు నిర్వహించారు.



