‘బాస్’ మోదీ రాజీనామా అడగండి: కేజ్రీవాల్
CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఉద్యమం చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ని ఉద్దేశించి అరవింద్ కేజ్రీవాల్ కీలక కామెంట్స్ చేశారు.గతంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరారని, ఇప్పుడు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా అడుగుతున్నారని అన్నారు. ఒక్కొక్కరి రాజీనామా కోసం ఉద్యమాలు చేయడం కంటే.. నేరుగా ‘బాస్’ ప్రధాని మోదీ రాజీనామా అడగాలని కేజ్రీవాల్ సూచించారు .జ్ఞానేశ్ కుమార్ తీసుకున్న చర్యలు తన కోసం కాకుండా ‘బాస్’ ఆదేశాల మేరకే జరిగాయని కేజ్రీవాల్ ఆరోపించారు.



