← Back to news

5 రోజుల్లోనే ఇల్లు.. 3డీ టెక్నాలజీతో నిర్మాణం!

By Anusha· 4 Oct 2026
5 రోజుల్లోనే ఇల్లు.. 3డీ టెక్నాలజీతో నిర్మాణం!

ఇల్లు కట్టాలంటే నెలలు పట్టే రోజులకు ఇక గుడ్‌బై! ‘3డీ కాంక్రీట్ ప్రింటింగ్’ టెక్నాలజీతో కేవలం 5 రోజుల్లోనే ఇల్లు నిర్మించొచ్చు. కంప్యూటర్‌లో రెడీ చేసిన డిజైన్‌ ప్రకారం గాంట్రీ రోబోట్ ప్రత్యేక కాంక్రీట్ మిశ్రమంతో గోడలను నిర్మిస్తుంది. దీంతో ఖర్చు, నిర్మాణ సమయం రెండూ తగ్గనున్నాయి. పేదల కోసం ఏపీ ప్రభుత్వం ఈ టెక్నాలజీని ఉపయోగించనుంది. బుర్రిపాలెంలో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.

More in AP