ధర్నాలో పాల్గొన్న ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు

AP:విజయవాడలో గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ధర్నా చేసిన 46 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సెప్టెంబర్ 27న జరిగిన నిరసనలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఉద్యోగులకు కలెక్టర్లు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సచివాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన ఉద్యోగులకు నోటిసులు ఇచ్చి వారు ఇచ్చే వివరణను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని తెలిపింది.

