మండపాల ఏర్పాట్లలో భద్రతా ప్రమాణాలు పాటించాలి

TG: వరంగల్ జిల్లా ఖానాపూర్‌లో గణేష్ మండపాల నిర్వాహకులు విద్యుత్ ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని విద్యుత్ శాఖ అదనపు సహాయ ఇంజినీర్ ఎ. మంగమ్మ సూచించారు. లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషియన్‌తోనే వైరింగ్ పనులు చేయించాలని, మండపాల్లో ఈఎల్‌సీబీ, నాణ్యమైన ఎంసీబీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. వైర్లకు ఎలాంటి జాయింట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకరాదని సూచించారు. విద్యుత్ స్తంభాలకు ఫ్లెక్సీలు కట్టకూడదని స్పష్టం చేశారు.



