← Back to news

పుష్కర ఘాట్ నిర్మాణానికి భూమిపూజ

By DK· 8h ago
పుష్కర ఘాట్ నిర్మాణానికి భూమిపూజ

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు రూ.75 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి భూమిపూజ చేశారు. చెన్నూరు సమీపంలోని గోదావరి నది వద్ద పుష్కర ఘాట్ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పుష్కరాల సందర్భంగా చెన్నూరు ప్రాంతాన్ని సుమారు రూ.75 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రోడ్ల విస్తరణ, పుష్కర ఘాట్లు, వెల్‌కమ్ ఆర్చ్‌లు, మరుగుదొడ్లు, స్నానాల గదులు వంటి పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.

More in Local