‘జెండా ఎగరేయమన్నారు.. ఎగరేస్తే జైల్లో పెడుతున్నారు’
‘హర్ ఘర్ తిరంగా’ అని చెప్పిన ప్రధాని మోడీ.. ఇప్పుడు యువత జెండా ఎగరేస్తుంటే వాళ్లను జైల్లో పెడుతున్నారని నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ విమర్శించారు. ఈ అయోమయం ఎందుకని ప్రశ్నించారు. యువతకు భయపడి, వాళ్ల మీద కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికే రైతులు బీజేపీకి ఓటేయడం మానేశారని, వచ్చే ఎన్నికల్లో యువత కూడా బీజేపీకి ఓట్లేయరని అన్నారు. ఇలాగే ప్రవర్తిస్తే ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారన్నారు.

