← Back to news

సెప్టెంబర్ మొత్తం.. పోలీస్ యాక్ట్ లో జగిత్యాల!

By Srikanth· 4d ago· Jagitial, Jagitial, Jagitial
సెప్టెంబర్ మొత్తం.. పోలీస్ యాక్ట్ లో జగిత్యాల!

జగిత్యాల జిల్లాలో Sept 1 నుంచి 30 వరకు పోలీస్ Act –1861 అమల్లోకి వస్తోంది. SP అశోక్ కుమార్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించకూడదు. డీజేలు వాడొద్దు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించొద్దు. ఇది బ్రిటిష్ కాలం నాటి చట్టం (Act V of 1861). నేటికీ అమల్లో ఉంది. ఇందులోని Sec-30 ప్రకారం, ప్రజా భద్రత కోసం పోలీసులు ఇలాంటి ఆంక్షలు విధించవచ్చు. అయితే ఎక్కువ సార్లు ప్రజాభద్రత పేరిట, నిరసనలను అణిచివేసేందుకు దీనిని ఉపయోగిస్తారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.