← Back to news

చెత్తకుప్పలో కాలిన డెడ్‌బాడీ.. హత్యా? ప్రమాదమా?

By Mahesh· 6 Aug 2026· Hyderabad
చెత్తకుప్పలో కాలిన డెడ్‌బాడీ.. హత్యా? ప్రమాదమా?

TG: హైదరాబాద్‌లోని దోమలగూడ గోశాల దగ్గర ఈరోజు ఉదయం చెత్తకుప్పలో గుర్తుతెలియని వ్యక్తి శవం మంటల్లో కాలిపోతున్న ఘటన కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఫైర్ డిపార్ట్‌మెంట్ స్టాఫ్, పోలీసులు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఘటనపై కేస్ ఫైల్ చేసి, పోలీసులు ఆ ఏరియాలోని CC టీవీ ఫుటేజ్‌ను చెక్ చేస్తున్నారు. ఆ వ్యక్తిని హత్య చేసి చెత్తకుప్పలో పడేసి తగలబెట్టారా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 8h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.