పెన్షన్ కోసం వెళ్లి తిరిగి రాలేదు

పల్నాడు జిల్లా రెంటచింతల మండలం ఇట్టిపాలెం గ్రామానికి చెందిన దాపులూరి కనకయ్య ఈ నెల 17న అదృశ్యమయ్యారు. కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు బైక్‌పై రెంటచింతలకు బయలుదేరిన ఆయన తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య ఏలియమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు రెంటచింతల ఎస్‌ఐ సీహెచ్ నాగార్జున కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కనకయ్యకు ఏదైనా ప్రమాదం జరిగిందా, స్వయంగా ఎక్కడికైనా వెళ్లిపోయారా అనే కోణాల్లో విచారణ చేపట్టారు.



