← Back to news

మంత్రిని కలిసిన షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ప్రతినిధులు

By Mohan· 4d ago
మంత్రిని కలిసిన షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ప్రతినిధులు

రేగిడి మండలం సంకిలి షుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమితి ప్రతినిధులు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని కలిశారు. చెరుకు రైతుల సమస్యను ఫ్యాక్టరీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఎల్ నినో ప్రభావం వల్ల 202-28 క్రాషింగ్ సీజన్‌ను మూసేస్తున్నట్టు సంకిలి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్ణయించడంతో రైతులు పడుతున్న ఇబ్బందిని వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే సంకిలి షుగర్ ఫ్యాక్టరీ జి.ఎంకు ఫోన్ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.