హాస్పిటల్లో పార్కింగ్ ఫీజులపై హైకోర్టు స్టే

TG: ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్లో పార్కింగ్ ఫీజుల వసూళ్లను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి బి. విజయ్‌సేన్ రెడ్డి, సంబంధిత అధికారులను వివరణ కోరారు. ఖమ్మం కలెక్టర్, హాస్పిటల్ సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్ సహా పలువురు అధికారులకు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను నవంబర్ 12కు వాయిదా వేశారు.



