కూటమి గెలిస్తే మరింత అభివృద్ధి: దొన్నుదొర

అల్లూరి జిల్లాలోని డుంబ్రిగూడ మండలం కొర్రాయి పంచాయతీ పెద్ద అంజోడ గ్రామంలో సోమవారం ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం జరిగింది. టీడీపీ అరకు నియోజకవర్గ ఇన్‌చార్జి డా. సియ్యారి దొన్నుదొర రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందజేశారు. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. అధికారులు రైతుల వద్దకే వచ్చి పాస్‌పుస్తకాలు అందించడం మార్పుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో జనసేన ఇన్‌చార్జి శెట్టి చిరంజీవి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



