← Back to news

రైతుల సమక్షంలోనే భూరీసర్వే నిర్వహించాలి: కలెక్టర్

By DK· 5h ago
రైతుల సమక్షంలోనే భూరీసర్వే నిర్వహించాలి: కలెక్టర్

వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం వసంతపూర్‌లో భూ రీసర్వేపై గ్రామసభ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్య శారద పాల్గొని రైతులకు రీసర్వే ప్రక్రియపై అవగాహన కల్పించారు. భూ హక్కులు, సరిహద్దులు, విస్తీర్ణం తదితర వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పక్కాగా నమోదు చేస్తామని తెలిపారు. రైతులు తమ భూముల వివరాలను పరిశీలించుకుని అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనంతరం వరంగల్ మండలం కొత్తపేటలో జరుగుతున్న ఫీల్డ్ రీసర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు.

More in Local