ఆమరణ నిరాహార దీక్ష చేస్తా

12 ఏళ్లుగా తనకు రావాల్సిన రూ.8.93 లక్షల గ్రాట్యుటీ బకాయిలు చెల్లించలేదని నల్గొండ జిల్లాకు చెందిన చిట్యాల మాజీ పీఏసీఎస్ సీఈఓ, కార్యదర్శి ఎం. దామోదర్ ఆవేదన వ్యక్తం చేశారు. 12 శాతం వడ్డీతో బకాయిలు ఇప్పించాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు. బకాయిలు చెల్లించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని పేర్కొన్నారు. 71 ఏళ్ల వయసులో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం అవస్థలు పడుతోందని, తన కుమారుడి ఉన్నత చదువులకు కూడా ఆటంకం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.



