బంగారం పోయింది.. పోలీసులు ఏం చేశారంటే?

బస్సులో బ్యాగ్ మిస్ అయింది. అందులో 7 గ్రాముల బంగారు చెవిదిద్దులు, ఉంగరం, రూ.2,200 నగదు. మొత్తం విలువ సుమారు రూ.లక్ష. విశాఖ నుంచి సొంతూరు వెళ్తున్న గిరడ సుధాకర్‌కు ఇది షాక్. విజయనగరం జిల్లా రాజాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ నవీన్ కుమార్ టీమ్ సీసీటీవీ ఫుటేజ్‌తో బ్యాగ్ ట్రేస్ చేసింది. బంగారం, నగదు బాధితుడికి అప్పగించారు. పోలీసులకు థ్యాంక్స్ చెప్పారు సుధాకర్.



