← Back to news

తొలిరోజు బతుకమ్మ.. special ఏంటంటే!

By Prashanth· 10 Oct 2026
తొలిరోజు బతుకమ్మ.. special ఏంటంటే!

TG: తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు జరుపుకునే బతుకమ్మను ‘ఎంగిలిపూల బతుకమ్మ’ అంటారు. రకరకాల పూలతో బతుకమ్మను అందంగా పేర్చి గౌరీదేవిని పూజిస్తారు. మహిళలు ఆటపాటలతో వేడుకలు జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పండుగలో రోజుకో రకమైన నైవేద్యం ఉంటుంది. మొదటి రోజు బతుకమ్మకు నువ్వులు, బియ్యంపిండి, నూకలు, బియ్యంతో చేసిన ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.

More in TG