పెరిగిన చికెన్ ధరలు!

తెలుగు రాష్ట్రాల్లో పండుగల సీజన్ దగ్గరపడటంతో చికెన్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం రీటైల్ మార్కెట్‌లో కిలో చికెన్ ధర ఏకంగా 280 రూపాయల నుంచి 290 వరకు పలుకుతోంది. లైవ్ బాయిలర్ కోడి కిలో 160 రూపాయల నుంచి 175 పలుకుతుండగా, స్కిన్‌లెస్ చికెన్ 230 రూపాయల నుంచి 260 వరకు ఉంది. ఇక బోన్‌లెస్ చికెన్ ప్రియులకు 280 రూపాయల నుంచి 320 వరకు ఖర్చవుతోంది. రాబోయే రోజుల్లో ఈ రేట్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.


