గణనాథుల సన్నిధిలో నందారం నరసింహ గౌడ్

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రామచంద్రపురం, బీరంగూడ డివిజన్లలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ సందర్శించారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు ఆయనకు స్వాగతం పలికి శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా నరసింహ గౌడ్ మాట్లాడుతూ.. వినాయక ఉత్సవాలు ప్రజల్లో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని అన్నారు.



