నోటీసులు ఇచ్చారు.. కానీ అధికారులే రాలేదు!

TG: నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో అధికారుల తీరుపై గ్రామపంచాయతీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 9 గంటలలోపు గ్రామపంచాయతీ కార్యాలయానికి హాజరుకావాలని అధికారులు నోటీసులు జారీ చేయగా, నోటీసులు అందుకున్న సభ్యులు నిర్ణీత సమయానికి కార్యాలయానికి చేరుకున్నారు. అయితే 11 గంటలు దాటినా సంబంధిత అధికారులు కార్యాలయానికి హాజరుకాకపోవడంతో సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. అధికారులే సమయపాలన పాటించాలని సూచిస్తూ నోటీసులు ఇచ్చి, తామే కార్యాలయానికి ఆలస్యంగా రావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



