అయోధ్య విరాళాల కౌంటింగ్‌లో కఠిన నిబంధనలు!

అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విరాళాల కౌంటింగ్ సిస్టమ్‌లో కఠిన రూల్స్ తెచ్చింది. విరాళాలు లెక్కించేటప్పుడు సిబ్బంది మొబైల్స్, కెమెరాలు, బ్యాగులు వాడటంపై పూర్తి నిషేధం విధించింది. సిబ్బంది కుర్చీల్లో కాకుండా నేలపైనే కూర్చుని లెక్కించాలని, జేబులు లేని డార్క్ బ్లూ యూనిఫామ్ మాత్రమే ధరించాలని డ్రెస్ కోడ్ పెట్టింది. SIT సూచనలతో కౌంటింగ్ హాల్‌లో 24 గంటలు CCTV నిఘా ఉంచడంతో పాటు, సిబ్బందికి రెండు సార్లు సెక్యూరిటీ స్క్రీనింగ్ చేయనున్నారు.



